అలవోకగా.. లక్నోపై రాజస్థాన్ విజయం
రాణించిన శాంసన్, జురేల్
n ప్లేఆఫ్‌కు మరింత చేరువ
లక్నో: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. 197 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తద్వారా లక్నో సూపర్‌జెయింట్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 76; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. దీపక్ హుడా (31 బంతులో 50; 7ఫోర్లు) రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, ఆవేశ్ ఖాన్, అశ్విన్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులకు పరిమితమైంది.
సంజూ శాంసన్ (33 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపగా.. ధ్రువ్ జురేల్ (34 బంతుల్లో 52 నాటౌట్ ; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకరించి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. లక్నో బౌలర్లలో యష్ ఠాకూర్, స్టోయినిస్, అమిత్ మిశ్రాలు తలా ఒక వికెట్ పడగొట్టారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించిన శాంసన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. లీగ్‌లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనుండగా.. తొలి పోరులో గుజరాత్‌తో బెంగళూరు.. రెండో మ్యాచ్‌లో చెన్నై, హైదరాబాద్ తలపడనున్నాయి. మొదట బ్యాటింగ్‌లో లక్నోకు అనుకున్నంత శుభారంభం దక్కలేదు.
11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో రాహుల్, దీప్‌క్ హుడాలు లక్నో ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరు ఔటైన తర్వాత మిగతవారు రాణించడంలో విఫలం కావడంతో లక్నో 200 పరుగుల మార్క్‌ను అధిగమించడంలో విఫలమైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌కు బట్లర్ (18 బంతుల్లో 34), జైశ్వాల్ (18 బంతుల్లో 24) శుభారంభం అందించారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటు రియాన్ పరాగ్ (14) వెనుదిరగడంతో రాజస్థాన్ కష్టాల్లో పడినట్లు అనిపించింది. అయితే కెప్టెన్ శాంసన్, ధ్రువ్ జురేల్‌లు మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 196/5 (రాహుల్ 76, దీపక్ హుడా 50; సందీప్ 2/35),
రాజస్థాన్: 19 ఓవర్లలో 199/3 (శాంసన్ 71 నాటౌట్, జురేల్ 52 నాటౌట్ ; స్టోయినిస్ 1/3)






