15 June, 2026 | 11:27 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

రాజే యువరాజే..

26-12-2025 01:59 AM

స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.

బ్యాక్‌గ్రౌండ్‌లో ‘రాజే యువరాజే..’ అంటూ సాగుతుంటే.. ప్రభాస్ క్రిస్మస్ ఏర్పాట్లు చేస్తూ కనిపించి ఆకట్టుకున్నారు. మేకర్స్ ఈ ప్రోమోను విడుదల చేయటం ద్వారా క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలోనే ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని; ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, కింగ్ సోలొమన్; ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్; ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు.