calender_icon.png 26 December, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్టీలేయర్స్ రోల్‌తో నేను రెడీ

26-12-2025 02:00:43 AM

యంగ్ హీరో హవిష్ కథానాయకుడిగా దర్శకుడు త్రినాథరావు నక్కిన ‘నేను రెడీ’ చిత్రాన్ని పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌నర్‌గా తెరకెక్కిస్తున్నారు. హర్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. చిత్రబృందం క్రిస్మస్ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హవిష్ లుక్ మిడిల్ క్లాస్ మ్యాన్‌లా వుంది. అతని నిలబడిన తీరు యాక్షన్‌కు సిద్ధంగా ఉన్నట్లు వుంది.

వినోదాత్మక చిత్రాలను అందించడంలో పేరుగాంచిన దర్శకుడు త్రినాథరావు, హవిష్‌ను మల్టీలేయర్స్ వున్న హ్యూమర్ రోల్‌లో చూపిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. పోస్ట్‌ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. పాండిచ్చేరిలో హీరోహీరోయిన్లపై చిత్రబృందం చిత్రీకరించిన సాంగ్ షూట్ పూర్తి చేసింది. ఈ పాటకు విజయ్ పోలాకి మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీశర్మ, వీటీవీ గణేశ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్‌గా, రామకృష్ణ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను విక్రాంత్ శ్రీనివాస్ అందించారు.