26-12-2025 01:58:15 AM
రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఇందులో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో సినిమాపై అంచనాలేర్పడ్డాయి. ఈ చిత్రంలో రామ సత్యనారాయణ పాత్రలో అలరించనున్నారు రవితేజ.
అయితే, తాజాగా మేకర్స్ క్రిస్మస్ విషెస్ అందిస్తూ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ సాంటాక్లాజ్ లుక్‌లో ఫెస్టివ్ వైబ్‌లో కనిపించడం ఆకట్టుకుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సంక్రాంతికి ప్రేక్షకులను అలరించబోతున్న ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్.