calender_icon.png 29 June, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ గా రాజేందర్

29-06-2025 06:24:33 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ మున్సిపల్(Kagaznagar Municipal) కమిషనర్ గా ఏ. రాజేందర్ ను నియమిస్తూ వరంగల్ రీజినల్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగజ్ నగర్ రెవెన్యూ ఆఫీసర్ గా పనిచేస్తున్న రాజేందర్ కు కమిషనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఇక్కడ కమిషనర్ గా పని చేసిన అంజయ్య చెన్నూరు మున్సిపాలిటీకి బదిలీ అయిన విషయం తెలిసింది. సోమవారం రాజేందర్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది.