1 May, 2026 | 10:12 PM

పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి

29-06-2025 06:27 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని కోరన్నపేట్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు(District Education Officer Rama Rao) ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో తరగతులు జరుగు విధమును వారి నుండి ఆరా తీశారు. వారితో ఆదివారం సందర్భంగా ఆటవిడుపుగా  విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆట ఆడారు.  అదే విధంగా పాఠశాల విద్యార్థుల కోసం తయారు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.  విద్యార్థులకు చక్కగా చదువుకోవాలని, చక్కగా  భోజనం చేయాలని, అందరూ కలిసి మెలసి ఆటలు ఆడాలని వారికి సూచించారు.  అదేవిధంగా పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్యూటీ టీచర్ రవి, వంట సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.