విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షునిగా రాజేందర్ రెడ్డి

15-09-2026 | 11:49pm

హుజురాబాద్,(విజయక్రాంతి)కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజరాబాద్ విశ్వహిందూ పరిషత్ మండల కమిటీ(Vishwa Hindu Parishad Mandal Committee)ని పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ ఆవరణంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మండల కమిటీ మంగళవారం జిల్లా కార్యదర్శి ఉప్పల శ్యామ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా కంకణాల రమేష్ రెడ్డి, గీసుకొండ కిషన్, కార్యదర్శిగా భాషా బోయిన చంద్రయ్య, రావుల సురేష్ ను ఎందుకునట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  మండలంలోని అన్ని గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు హిందువులందరినీ ఏకతాటికి తీసుకురావాలని అలాగే ప్రకృతి వ్యవసాయం(Natural farming) దేశవళి ఆవుతో జరిగే ప్రయోజనాలను తెలిపారు, . ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవా ప్రముఖ కోమల రాజేందర్ రెడ్డి, రాష్ట్ర గోరక్ష ప్రముఖ ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, విశ్వహిందూ పరిషత్ జిల్లా గోరక్ష ప్రముఖ రావుల అనిల్, పట్టణ అధ్యక్షుడు కొమురవెల్లి రాజు, కార్యదర్శి కనకం శ్రీనివాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు