జన్నారం ఎంఈఓగా రాజేంద్ర కుమార్ బాధ్యతల స్వీకరణ
12-06-2026 07:30 PM
జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇన్చార్జ్ మండల విద్యాధికారి (MEO) గా రాజేంద్ర కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మండల కేంద్రంలోని ఎంఆర్సీ (MRC) భవనంలో అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ మండలంలో విద్యావ్యవస్థ బలోపేతానికి, విద్యా రంగం పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు తోటి అధికారులు, ఉపాధ్యాయులు, స్థానికులు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.






