12 June, 2026 | 8:13 PM

ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ

12-06-2026 07:28 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాల హుజురాబాద్ లో మొదటి సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇంటర్ విద్యాధికారి,ప్రిన్సిపాల్  వి.ఆంజనేయరావు  నూతన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరుకావాలని, అధ్యాపకులు బోధించిన వాటిని శ్రద్ధతో విని, సందేహాలను నివృత్తి  చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల  సీనియర్   లెక్చరర్ వాసుదేవరావు, లైబ్రేరియన్ రాజేశం, పాల్గొన్నారు.