20 August, 2026 | 9:01 PM

రాజీవ్ కలలు కన్న భారత సాంకేతిక నిర్మాణం... దేశానికే మార్గదర్శకం

20-08-2026 08:24 PM

జవహర్ నగర్ లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు

టీపీసీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్

జవహర్ నగర్,(విజయక్రాంతి): భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ కలలు కన్న భారత సాంకేతిక నిర్మాణం దేశానికే మార్గదర్శకమని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని టిపిసిసి రాష్ట్ర వైస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు జవహర్ నగర్ కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి టిపిసిసి రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ గడ్డం శ్రీనివాస్ హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మీ బోధనలే మాకు బలం మీ జ్ఞాపకాలే మాకు ధైర్యం మీరు కలలుగన్న భారత్ నిర్మాణం మాకు మార్గదర్శకంగా" ఉంటుందని తెలిపారు. నవభారత భారత నిర్మాత టెక్నాలజీకి ఆది పురుషుడు రాజీవ్ గాంధీయేనని భారత్ ఐటీ రంగంలో పురోగ వృద్ధి సాధించిందంటే దానికి మూల కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ యే నని ఆయనతెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సదానందం, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్ గుప్త, ఓబీసీ భాగం చైర్మన్ పసుపులేటి వీర భాస్కరరావు, అనంతలక్ష్మి, సుబ్రహ్మణ్యం ,నర్సింగ్ ముఖేష్, చింతా విజయ్ విజయరాయి వెంకటేశ్వర్లు శ్రావణ్ కుమార్ కిరణ్ బొబ్బిలి మంజుల సుంకరి శ్రీనివాస్ నర్సింగ్ చెక్కుల శ్రీనివాస్ కృష్ణ సాయి, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.