ఏసీబీకి పట్టుబడ్డ రాజంపేట ఎస్సై
30000 లంచం తీసుకుంటూ కామారెడ్డిలో పట్టుబడిన వైనం
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై ఆంజనేయులు గురువారం పట్టుబడ్డారు. సిమెంట్ దుకాణం లో వచ్చిన వివాదం పరిష్కరించేందుకు సిద్ధిరాములు నుంచి 50 వేల రూపాయలు ఎస్సై ఆంజనేయులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా సిద్ధిరామం నుంచి పదివేలు తీసుకున్న ఎస్ఐ ఆంజనేయులు గురువారం మధ్యాహ్నం కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోని ఎస్సై నివాసంలో మరో 30000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఎస్సై నివాసంలో కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలో ఫైళ్లను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. సంబంధించి వివరాలపై విచారణ కొనసాగిస్తున్న ఏసీబీ అధికారులు. కామారెడ్డి జిల్లాలో ఎస్సై ఏసీబీ అధికారులకు రెడ్యాండెడ్గా పట్టుబడడం కలకలం రేపుతుంది. గతంలో కామారెడ్డి జిల్లాలో లింగంపేట ఎస్సై ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం మరిచిపోక ముందే రాజంపేట ఎస్సై ఆంజనేయులు ఎసిబి అధికారులకు పట్టుబడడం కలకలం సృష్టిస్తుంది.






