మేడ్చల్, గుండ్లపోచంపల్లిలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం వేముల శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ అర్బన్ మే21(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 297,298 డివిజన్ పరిధిలో భారత మాజీ ప్రధాన మంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు మేడ్చల్,గుండ్లపోచంపల్లి పట్టణాలలో ఘనంగా నిర్వహించారు.మేడ్చల్ సర్కిల్ పరిధిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద 297,298 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ సాంకేతిక ప్రగతికి యువతకు ఓటు హక్కు కల్పనకు రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని వారు కొనియాడారు.
అనంతరం గుండ్లపోచంపల్లి 299 వ డివిజన్ పరిధిలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ ఆధ్వర్యంలో మాజి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ధ్యారదృష్టి గల నాయకులు రాజీవ్ గాంధీ ఒక్కరేనని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి.మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, మాజి కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ.చాప రాజు.మహేష్.శ్రవణ్ గుప్త.మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యు.సత్యనారాయణ.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోమారం బాల్ రెడ్డి,చెరువుకొమ్ము శేఖర్ గౌడ్.ఆర్ సంతోష్ గౌడ్.రఘుపతి రెడ్డి.వెంకటేష్ ముదిరాజ్.రాజశేఖర్ రెడ్డి.ఎర్ర విజయ్ రావు.నరసింగరావు.వేముల రంజిత్ రెడ్డి.మాజి జడ్పీటీసీ సాయిపేట శ్రీనివాస్.మాజి సర్పంచ్ లు బండారి నరేందర్ ముదిరాజ్. గర్సెల సురేందర్ ముదిరాజ్.ఆలయ కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి.ఓబీసీ సెల్ అధ్యక్షులు గువ్వ రవి.కావేరి శేఖర్.అమరం సురేష్ రెడ్డి.కావాలి భాస్కర్.తదితరులు పాల్గొన్నారు.






