calender_icon.png 20 August, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి

20-08-2025 12:59:06 PM

మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు..

మద్నూర్ (విజయక్రాంతి): మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) సేవలు మరువలేనివని మండల కాంగ్రెస్ నాయకులు దరాస్ వార్ సాయిలు అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడూతూ, రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకుంటూ, యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. ఆనాటి పునాదుల్లో నేడు దేశ పురోగతిని టెక్నాలజీని మనం గమనిస్తున్నామన్నారు. నాడు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ స్వాతంత్రంలో మహాత్మా గాంధీ, నెహ్రూ చేసినటువంటి కృషి, వారు తీసుకొచ్చిన సంస్కరణలను ముందుకు కొనసాగిస్తూ దేశ పురోగతికి ఎనలేని సేవలు చేసిన రాజీవ్ గాంధీని స్మరించుకుంటూ ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ వార్ సాయిలు, మిర్జాపూర్ హనుమాన్ మందీర్ చైర్మన్ రామ్ పటేల్,ఏఎంసీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్, సీనియర్ నాయకులు హన్మండ్లు స్వామి, కొండ గంగాధర్, వట్నాల్ వార్ రమేష్, మాజీ ఎంపీటీసీ కుషాల్, బండి గోపి, దిగంబర్, బాద వార్ హన్మండ్లు  గంగాధర్ కర్రె వార్, శివరెడ్డి,బండి హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.