20-08-2025 02:46:49 PM
ముత్తారం (విజయక్రాంతి): మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) 81వ జయంతి కార్యక్రమం ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.