calender_icon.png 20 August, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరికి భారీ వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

20-08-2025 12:56:43 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో గోదావరి నది(Godavari River) ఉధృతంగా ప్రవహిస్తూ మెట్లు దాటి ప్రవహించడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజ్ వద్ద 9 లక్షల 90 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం రాగా మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నందున లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.