లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం
న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్రప్రభుత్వం(Central Government) మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. లోక్‌సభ ముందుకు జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లు, యూటీల సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లులను బుధవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ప్రవేశపెట్టారు. మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ లోక్ సభలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ ఆరోపించింది. విపక్ష ఎంపీల నినాదాల మధ్య లోక్ సభ వాయిదా పడింది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎంలు, మంత్రుల ఉద్వాసన బిల్లు జేపీసీకి పంపనున్నట్లు అమిత్ షా ప్రకటించారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ, "ఈ మూడు బిల్లులను ప్రవేశపెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను.. ఈ బిల్లు రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది... సుప్రీంకోర్టు పదే పదే వ్యతిరేకిస్తున్న రాష్ట్ర పార్టీల రాజకీయ దుర్వినియోగానికి ఈ బిల్లు తలుపులు తెరుస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న అన్ని రాజ్యాంగ రక్షణలను గాలికి విసిరేస్తుంది." ఎంపీ మనీష్ తివారీ అన్నారు.
లోక్‌సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులు..
1. రాజ్యాంగ (నూట ముప్పైవ సవరణ) బిల్లు, 2025
2. కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు, 2025
3. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2025






