03-10-2025 01:06:31 PM
హైదరాబాద్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ (Hitex Convention Center)లో జీటో కనెక్ట్ ఎగ్జిబిషన్ ను రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, బాబా రామ్ దేవ్ పాల్గొన్నారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వరంలో మూడ్రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. నిర్వహకులు ఎగ్జిబిషన్ లో 600కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. జీటో కనెక్ట్ కు 2 లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చే అవకాశముంది. వాణిజ్య నెట్ వర్కింగ్, స్టార్టప్ ప్రోత్సాహకం, సెషన్లు, వర్క్ షాపులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చేరుకున్న రాజ్ నాథ్ సింగ్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్, కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్ తోపాటు పలువురు నేతలు ఘనంగా స్వాగతం పలికారు.