19 March, 2026 | 2:17 PM

శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

19-03-2026 11:22 AM

హైదరాబాద్: భద్రాచలంలోని శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో(Sri Ramanavami Thirukalyana Brahmotsavam) భాగంగా సీతారామ కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని(CM Revanth Reddy) దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయ తిరుకల్యాణ మహోత్సవం మార్చి 27న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాయశాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఈవో ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 2 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.