28 August, 2026 | 12:57 PM

ఎమ్మెల్యే ఇంట్లో రాఖీ సందడి

28-08-2026 12:26 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలో(MLA Kova Lakshmi residence) రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు స్వయంగా రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించారు. రాఖీ పండుగ సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతను పెంపొందిస్తుందని ఆమె పేర్కొన్నారు.రాఖీ బంధం పరస్పర ప్రేమ, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే నివాసానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి ఆమెతో రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.