28 August, 2026 | 12:44 PM

మాజీ మంత్రి నివాసంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

28-08-2026 12:08 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ లోని మాజీ మంత్రి జోగు రామన్న(Former Minister Jogu Ramanna) నివాసంలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రక్షాబంధన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి జోగు రామన్న సోదరి చౌదరి పెంటమ్మ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఓం శాంతి బ్రహ్మకుమారి అక్కయ్యలు జోగు రామన్నకి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు అందజేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జోగు రామన్న గారు మాట్లాడుతూ.. ప్రతి కుటుంబంలో అన్నా-చెల్లి, అక్కా-తమ్ముడు మధ్య ఉన్న అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. రాఖీ కట్టడం ద్వారా అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత మరింత బలపడతాయని పేర్కొన్నారు. ఓం శాంతి బ్రహ్మకుమారి అక్కయ్యలు సమాజంలో శాంతి స్థాపన కోసం చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. వారి ఆశయాలు, స్ఫూర్తితో శాంతి, సోదరభావం కోసం ఎల్లవేళలా ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు బండారి దేవన్న, రేవతి అక్కయ్య, సరళ అక్కయ్య, ఆశక్క, కస్తాల ప్రేమల, పర్వీన్ ఫెరోజ్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.