28 August, 2026 | 12:56 PM

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి

28-08-2026 12:20 PM

సదాశివనగర్,ఆగస్టు 28 (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని పద్మాజివాడి గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు,జంధ్యాల పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. పద్మశాలీలు అత్యంత ప్రవితంగా భావించే జంధ్యాలను ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రం ఆలకించి ఆలపించి జాద్యాలు ధరిస్తారు. మార్కండేయ పూజ అనంతరం రాఖీలను కట్టుకొని ఒకరిఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు దాశి శ్రీకాంత్, శామయి బాలయ్య, మద్దె రమేష్, మహిందర్, తీరపతి,నర్సయ్య సంగయ్య,రాజు, ఆనంద్, బాలకిషన్, వెంకటేష్,సృజన్తదితరులు పాల్గొన్నారు.