28 August, 2026 | 2:11 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

కాంగ్రెస్ పార్టీ మరో కీలక అడుగు

28-08-2026 12:31 PM

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో మండల, పట్టణ, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికకు జిల్లా పరిశీలకుల(Congress District Observers) నియామకం జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్(Congress Committee President B. Mahesh Kumar Goud) మండల/పట్టణ/డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుల అభ్యర్థుల జాబితా సిద్ధం చేసేందుకు పలు జిల్లాలకు జిల్లా పరిశీలకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ప్రక్రియను ప్రారంభించి, అభ్యర్థుల జాబితాలను ఆగస్టు 31లోగా సమర్పించాలని ఆదేశించారు. సంస్థాగత బలోపేతం దిశగా కాంగ్రెస్ పార్టీ మరో కీలక అడుగు అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.