28 August, 2026 | 6:31 PM

మది నిండుగా.. రాఖీ పండగ

28-08-2026 05:26 PM

ఆత్మీయత, అనురాగానికి ప్రతీక రాఖీ పౌర్ణమి

పాపన్నపేట: సోదర సోదరీమణుల ఆప్యాయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుక మండల కేంద్రం పాపన్నపేటతో పాటు ఆయా గ్రామాల్లో శుక్రవారం కనుల పండువగా జరిగింది. సోదరీమణులు తమ సోదరులకు రక్షాబంధన్ కట్టి మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా సోదరీమణులు దూర ప్రాంతాల నుంచి పుట్టింటికి వచ్చి తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఒకరికొకరు రక్షగా ఉంటామంటూ మాట ఇచ్చి పుచ్చుకున్నారు. మిఠాయి, రాఖీల దుకాణాలు కిటకిటలాడాయి.