29 August, 2026 | 9:36 PM

ఆప్యాయత, అనురాగానికి ప్రతీక ‘రాఖీ’

29-08-2026 01:05 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): అన్నా చెల్లెల అనుబంధానికి ఆప్యాయతకు ప్రతీక రాఖీ పండుగ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం రాఖీ పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఆయన సతీమణి సరోజలకు పార్టీ మహిళ కమిటీ నాయకులు, పొదుపు సంఘాల మహిళలు, కాలనీ, బస్తి మహిళలు ఆప్యాయతతో రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ మన దేశ పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. రాఖీ పండుగ కుటుంబాల మధ్య ప్రేమ, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గం మీడియా సెల్ ఇంచార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, సీనియర్ నాయకుడు చంద్ర శేఖర్, మహిళా కమిటీ నాయకురాలు పద్మ, నవనీత, నాయకులు కొండ సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.