29 August, 2026 | 10:31 PM

రక్షాబంధన్ వేడుకల్లో దత్తాత్రేయ

29-08-2026 01:03 AM

మాజీ గవర్నర్‌కు రాఖీ కట్టిన పారిశుద్ధ్య కార్మికులు

ముషీరాబాద్, ఆగస్టు 28(విజయక్రాం తి): రాఖీ పండుగ సందర్బంగా శుక్రవారం రాంనగర్లోని తన నివాసంలో మాజీ గవర్న ర్, బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ మహిళా నాయకులు, కార్యకర్తలు, బ్రహ్మకుమారీలు, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల తో కలిసి  రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడు తూ రక్షాబంధన్ పండుగ సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీక అని అన్నారు.

వివిధ వర్గాల మహిళలతో కలిసి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బండారు కార్తిక రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్, బీజేపీ జాతీయ నాయకురాలు అరుణ జ్యోతి, మాజీ కార్పొరేటర్ మంత్రి కళావతి, భైరి అమరావతి, శోభా, మాధవి, జ్యోతి తదితర మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు, బ్రహ్మకుమారీలు, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.