29 August, 2026 | 3:18 AM

మోదీ నివాసంలో రక్షాబంధన్

29-08-2026 02:07 AM

ప్రధానికి రాఖీ కట్టిన చిన్నారులు

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రజల మధ్య అనురాగ, ఆప్యాయతలు విలసిల్లాలని, సామరస్యంగా బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని, రాఖీ పండుగ ప్రతీఒక్కరీ జీవితాల్లో సంతోషాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాఖీ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలిపారు.

ఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని నివాసంలో శుక్రవారం పాఠశాల విద్యార్థులు, చిన్నారులతో కలిసి ఆయన వేడుకలను నిర్వహించుకున్నారు. కాసేపు వారితో సరదాగా ముచ్చటిస్తూ అనురాగ, ఆప్యాయతలను పంచుకున్న వీడియోలను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రధానికి రాఖీకట్టి స్వీట్లు తినిపించారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాఖీపండుగ శుభాకాంక్షలు తెలిపారు.