వైభవంగా రక్షాబంధన్ వేడుకలు
28-08-2026 02:45 PM
సుల్తానాబాద్, ఆగస్టు 28 (విజయ క్రాంతి): ప్రేమ సోదరా భావం ... ఆప్యాయతకు ... ప్రతికగా నిలిచే రాఖీ పండుగ వేడుకలను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ, మండలంలోని గ్రామాల్లో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు, నీకు నేను రక్ష... నాకు నువ్వు రక్ష అంటూ చిన్నారులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు, సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు, అలాగే శ్రావణ పౌర్ణమి శుక్రవారం పురస్కరించుకొని ఇళ్లల్లో ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించి, సాంప్రదాయ దుస్తులతో దేవుడి వద్ద ప్రత్యేక పూజలు చేసి... జంజిరాలు వేసుకున్నారు...సుల్తానాబాద్ పట్టణం, మండలం లోని గ్రామాల్లోనూ రక్షాబంధన్ వేడుకల ను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు.






