రాఖీ అనేది కేవలం దారం కాదు.. ప్రేమ, బాధ్యతకు ప్రతీక
28-08-2026 03:18 PM
మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్...
బాన్సువాడ, ఆగస్టు 28 (విజయ క్రాంతి): రాఖీ అనేది కేవలం ఒక దారం మాత్రమే కాదని.. ప్రేమ, బాధ్యత, భద్రత, ఆత్మీయతలకు ప్రతీక అని మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్ అన్నారు. రక్షాబంధన్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమణుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అన్నారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుకోవడం, సోదరులు తమ సోదరీమణుల రక్షణకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని మాట ఇవ్వడం ఈ పండుగ విశిష్టత అని పేర్కొన్నారు. కుటుంబ విలువలు, మానవ సంబంధాల గొప్పతనాన్ని గుర్తుచేసే పండుగల్లో రక్షాబంధన్ ఒకటని తెలిపారు.






