రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
28-08-2026 | 03:54pm
నిర్మల్,ఆగస్టు28(విజయక్రాంతి): రాఖీ పండగ ( Raksha Bandhan greetings) సందర్భంగా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మహిళలకు రక్షణ, గౌరవం కల్పించాలనే బాధ్యతను ఈ పండుగ గుర్తుచేస్తుందని తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మరోసారి జిల్లా ప్రజలందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
