23 July, 2026 | 1:34 AM

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ర్యాలీ

23-07-2026 01:03 AM

మేడ్చల్ అర్బన్ జూలై 22(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ  నాయకులు ఎంపి రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ, నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మేడ్చల్ లో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు.

మహాత్మ గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు వజ్రాష్ యాదవ్, మాజి ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజి డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండించారు. నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిందని దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వజ్రేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రతిపక్ష నాయకులపై దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిసరీ మహిపాల్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గోమారం బాల్ రెడ్డి,డిసిసి కార్యదర్శి అధికార ప్రతినిధి ఉదండపురం సత్యనారాయణ, బిపిటి రాజు, మేడ్చల్, కిస్టాపూర్, గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.