13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

Ram Charan కు గాయం! ‘పెద్ది’ షూటింగ్‌లో జరిగిన ఘటన ఇదే!

26-03-2026 01:33 AM

స్టార్ హీరో రామ్‌చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో రామ్‌చరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

ఆయన కంటి దగ్గర దెబ్బ తలిగినట్టు సమాచారం. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై చరణ్ టీమ్ స్పందించింది. ‘చరణ్ కంటికి ఏమీ కాలేదు. దెబ్బ కంటిపైన కనుబొమ్మ పక్కన తగిలింది. నాలుగు కుట్లు పడ్డాయి. ఎవరూ భయపడాల్సిన పనిలేదు’ అని స్పష్టం చేశారు.

షూటింగ్‌కు ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా బుధవారం కూడా సెట్స్‌కు హాజరయ్యారని చిత్రవర్గాలు తెలిపాయి. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.