05-07-2025 12:49:22 AM
నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిథికల్ థ్రిల్లర్ రూపొందు తోంది. వర్కింగ్ టైటిల్ ‘ఎన్‌సీ24’తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాను శ్రీవేంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీ రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగ ణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
నాగచైతన్యతోపాటు ఇతర పరిశ్రమల నుంచి ప్రముఖ నటులు కూడా పాల్గొంటున్నారు. సెకండ్ షెడ్యూల్ అప్‌డేట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో జూట్ రోప్ పట్టుకుని కనిపిస్తున్నారు. ‘ఒక అడుగు లోతుగా.. ఒక అడుగు దగ్గరగా..’ అనే అంటూ ఈ పోస్టర్‌కు జోడించిన వ్యాఖ్య ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగచైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ప్రధాన తారాగణం వివరాలను నిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారు.