23-02-2026 12:45:05 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అరెస్ట్ సరికాదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ అధ్యక్షులు వెళ్ళడం నేరమా అని ప్రశ్నించారుబీజేపీని అణిచివేసే కుటిల ప్రయత్నం అధికార కాంగ్రెస్ చేస్తుందని అన్నారు.
బీజేపీ నేతలను, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి,నిర్బంధించడం హేయమైన చర్యగా భావిస్తున్నామని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఎమ్మెల్యేకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వెళ్తే... రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఉలికిపాటు ఎందుకు అని ప్రశ్నించారు? పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో నిర్బంధపు పాలన సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజానీకం, కామారెడ్డి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సరైన సమయంలో బుద్ధి చెబుతారని విమర్శించారు.