23-02-2026 12:44:30 AM
ఆలేరు, ఫిబ్రవరి 22 : ఆలేరు మండలం గోలనుకొండ గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి, ఇండిపెండెంట్గా సర్పంచ్గా పోటీ చేసిన నవీన్ గౌడ్ సుమారు 100 మంది అనుచరులతో కలిసి మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీలో ఘనంగా చేరారు. ఈ సందర్భంగా నవీన్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రయోజనాల కోసం పనిచేసే శక్తి బిఆర్‌ఎస్ పార్టీదేనని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గంగుల శ్రీనివాస్, గ్యాడపాక నాగరాజు, వడ్ల శోభన్ బాబు, కందుల శంకర్, కోటగిరి పాండరి, బాకీ రాములు, వంగాల బిక్షపతి, హైమావతి, కొమ్మరాజుల వెంకటేష్, బాకీ శ్రీను, కొమ్మరాజుల అశోక్, మారుపల్లి బిక్షపతి, శోభన్, స్వామి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.