30-06-2025 09:46:28 AM
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా( Telangana BJP President) మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అధికారికంగా నియమితులయ్యారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఆయన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేయాలని రామచందర్ రావుకు(Ramachandra Rao) బీజేపీ అధిష్ఠానం ఆదేశించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బలమైన పోటీదారులుగా మాజీ ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etela Rajender), నిజామాబాద్ ఎంపీ డి అరవింద్, కేంద్ర మంత్రి, తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పేర్లు వినిపించాయి. తెలంగాణలో కొత్త బిజెపి అధ్యక్షుడిని ఎంపిక చేయాలనే నిర్ణయం పూర్తిగా పార్టీ హైకమాండ్పైనే ఆధారపడి ఉంటుందని అంతర్గత వర్గాలు తెలిపాయి.