ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు, శనివారం సుల్తానాబాద్ లో విజయ రమణారావు ముస్లిం సోదరులకు కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు. అలాగే ఈద్గా వద్దకు మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ చేరుకొని ముస్లిం మత పెద్దలకు, ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ ఎంతో పవిత్ర మాసంగా పిలుచుకునే రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకున్నారని అన్నారు. అబ్దుల్ నవాబ్ ఇంటి వద్ద కొంతసేపు ఆగి నవాబు కు, కుటుంబ సభ్యులకు విజయ రమణారావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగావిజయరమణరావును ఘనంగా సన్మానించారు.
మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్, కందుకూరి ప్రకాష్ రావు ( పెద్దన్న) పలువురు ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు ఎమ్మెల్యే వెంట ఉన్నారు, పెద్దపల్లి డీసీపీ భుక్య రామ్ రెడ్డి, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్ర కుమార్, 9 వ వార్డు కౌన్సిలర్ తొర్రికొండ ప్రభాకర్ , స్తానిక ప్రజాప్రతినిధులు ఈద్గా వద్దకు చేరుకొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.....




