25 February, 2026 | 2:03 AM

రంజాన్ మత సామరస్యానికి ప్రతీక

25-02-2026 12:26 AM

ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్‌నగర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి):- మత సామరస్యానికి ప్రతీక రంజా న్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం బేగంపేటలోని పాటిగడ్డలో బీఆర్‌ఎస్ నాయకు లు నాని ఆధ్వర్యంలో ముస్లీం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.

ప్రత్యేక ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ముస్లీంలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ సందర్భంగా ముస్లీం సోదరీ, సోదరులు నెలరోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడతారని పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు చేప ట్టిన వారికి కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందును ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ కవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యా దవ్, నిర్వాహకులు నాని, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు నరేందర్, ఆరీఫ్, శేఖర్, మోయిన్, హాబీబ్, మహిళా నాయకురాలు నసీమా పా తదితరులు పాల్గొన్నారు.