25 February, 2026 | 2:04 AM

మనస్థాపంతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

25-02-2026 12:27 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) ఇటీవల తన స్నేహితుడు ఉరివేసు కొని ఆత్మహత్య చేసుకున్న విషయంలో తోటి స్నేహితులతో గొడవ పడిన ఓ యువకుడు మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దోమలగూడ ఇన్స్పెక్టర్ అంజద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.... దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ అంబేడ్కర్ నగర్‌లో నివాసం ఉండే జి. మణి ముగ్గురు కూతుళ్లు, ఒక కు మారుడు ఉన్నారు.

వీరిలో ఇద్దరు కూతుళ్ల వివాహం జరిగింది.. మరొక కూతురు వివా హం జరగాల్సి ఉంది. జి. మణి కుమారుడు జి. శ్రావాణ్ కుమార్(23) యువకుడు తాగుడుగుకు బానిసైయ్యాడు. ఇతని స్నేహితుడు ఎల్చిగూడకు చెందిన ప్రదీప్ ఈనెల 20న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన స్నేహితుడు ప్రదీప్ ఆకారణం గా ఉరేసుకొని చనిపోయాడని మద్యానికి భానిసై, స్నేహితులతో గొడవపడుతుండేవాడు.

తాగుడుకు బానిసైన శ్రావణ్ కుమా ర్ అంబేడ్కర్ నగర్‌లోని తన నివాసంలో సోమవారం రాత్రి ఎప్పటిలాగే నిద్రపోయా డు. అయితే శ్రావణ్  తెల్లవారు జామున ఇంట్లో తన తల్లి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యుల సహాకారంతో చికిత్స నిమిత్తం గాంధీ ధవాఖానకు తరలించగా అప్పటికే శ్రావణ్ మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు.

తన కుమారుడు స్నేహితుడు మర ణించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు తెలిపారు. తన స్నేహితుడు మృతుడు తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు దోమలగూడ పోలీసులు కేసు నమో దు చేసినట్లు తెలిపారు. ఈ కేసును ఎస్‌ఐ విజయ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకొని శ్రావణ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్గం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.