15 July, 2026 | 12:41 AM

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రామగుండం సీపీ, జిల్లా కలెక్టర్

15-07-2026 12:00 AM

పెద్దపల్లి, జూలై 14 (విజయక్రాంతి): సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆర్జీ-1 పరిధిలోని ఓసీపీ-05 వద్ద జరిగిన కార్యక్రమంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, జిల్లా కలెక్టర్ కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్ఠంగా చేపట్టినట్లు సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ, సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.