15 July, 2026 | 12:39 AM

‘సర్’ గడువు ఆగస్టు 30 వరకు పొడిగించాలి

15-07-2026 12:00 AM
  1. సర్ ఫారంలో 2002 నాటి ఓటు కాలమ్‌ను తొలగించాలి
  2. సీపీఎం మండల కార్యదర్శి ఎన్.సబిత

ఘట్ కేసర్, జూలై 14 (విజయక్రాంతి) : సర్ పేరుతో పేదల ఓట్లను తొలగించడానికి కుట్ర జరుగుతుందని, 20 రోజులు గడుస్తున్న 30 శాతం పని పూర్తి కాలేదని ఆగస్టు 30 వరకు సర్ గడువు పొడిగించాలని, సర్ ఫారం లోని 2002 ఓటు కాలం ను తొలగించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎన్. సబిత డిమాండ్ చేశారు.

మంగళవారం ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్, అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలో సర్ నిర్వహించబడుతున్న ప్రక్రియను సర్ పేరుతో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను సిపిఎం ప్రతినిధి బృందం  పరిశీలించింది. ఓటర్ల సర్ కష్టాలను అడిగి తెలుసుకుంది. 

బిఎల్వోలతో సిపిఎం నాయకత్వం అనేక విషయాలు చర్చించింది అనంతరం  సిపిఎం మండల కార్యదర్శి ఎన్. సబిత మాట్లాడుతూ 2002లో మీ ఓటు ఎక్కడుందో దాని వివరాలు కావాలని అడగటం వల్ల నిరుపేద నిరక్షరాస్యులైన వారు నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

సర్ ఫారాల పంపిణీ 50 నుంచి 60 శాతం పూర్తి కాగా, ఆ ఫారాలు నింపినవి 30శాతం మాత్రమే  సేకరించబడ్డాయన్నారు.  పేదలు తమ ఓటును రక్షించుకోవడానికి సర్ గడువును పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మండల కమిటీ సభ్యురాలు జి. నాగమణి, బి. సునీతదేవి  కె. అనసూయ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.