18 May, 2026 | 5:08 PM

బండి సంజయ్ తప్పు చేయలేదు: రామచందర్‌రావు

18-05-2026 03:57 PM
  1. బండి సంజయ్‌ తప్పు చేస్తే పార్టీ చర్యలు
  2. ముందస్తు బెయిల్‌ తీసుకోవడం అనేది హక్కు
  3. భగీరథ్‌ సరెండర్‌ అయ్యాడు
  4. బీఆర్ఎస్‌కు ఇంకో పని లేనట్టు ఉంది
  5. కోట్లు ఖర్చు చేసి రాష్ట్రమంతా పోస్టర్లు వేస్తున్నారు
  6. బండి సంజయ్‌, ఆయన కుమారుడికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రచారం 

  7. ముందస్తు బెయిల్ అంటే ఏమిటి?
  8. 👉 అరెస్ట్‌కు ముందు కోర్టు నుంచి తీసుకునే రక్షణాత్మక బెయిల్‌ను ముందస్తు బెయిల్ అంటారు.
  9. 👉 ఇది వ్యక్తిగత హక్కు కింద వస్తుంది.

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పార్టీలు బీజేపీపై(Bharatiya Janata Party) దుష్ప్రచారం చేస్తున్నాయని టీబీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు(Telangana BJP Chief Ramchander Rao) మండిపడ్డారు. వ్యక్తిని, కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ తీసుకోవడం అనేది హక్కు అన్నారు. భగీరథ్‌ పోలీసులకు సరెండర్‌ అయ్యాడని తెలిపారు. బండి సంజయ్, బీజేపీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలిపారు. రూ. కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రమంతా పోస్టర్లు వేశారని ధ్వజమెత్తారు.

తెలంగాణ రాజకీయాలపై తాజా అప్‌డేట్స్ కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్ పేజీని సందర్శించండి.

కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) తప్పు చేయలేదని రామచందర్‌రావు కితాబిచ్చారు. బండి సంజయ్ కుటుంబీకులు తప్పు చేస్తే న్యాయ పరంగా చర్యలుంటాయని చెప్పారు. బండి సంజయ్ లక్ష్యంగా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో మహిళలపై 67 శాతం క్రైమ్ రేటు పెరిగిందన్నారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇతర ముఖ్య ఘటనల కోసం నేషనల్ విభాగాన్ని చదవండి.

జూబ్లీహిల్స్ బాలిక కేసులో కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిందని గుర్తుచేశారు.

తెలంగాణలో జరుగుతున్న మరిన్ని రాజకీయ పరిణామాల కోసం Latest news విభాగాన్ని చదవండి.

మద్యం కేసులో మహిళ జైలుకు వెళ్తే.. కేసీఆర్, కేటీఆర్ రాజీనామా? చేశారా? అని రామచందర్‌రావు ప్రశ్నించారు. కేటీఆర్ కు నైతిక విలువలు లేవని మండిపడ్డారు. మీ ఇంటి ఆడ బిడ్డ చేస్తే ఎందుకు రాజీనామా చేయలేదన్నారు. ప్రజా సమస్యలపైన పోరాడటం చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. కాళేశ్వరం, ఈ కార్ రేస్ కేసులో కేసీఆర్, కేటీఆర్ ను రేవంత్ రెడ్డి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిశాయి కాబట్టే అరెస్ట్ చేయడం లేదని సూచించారు. రైతులు ధాన్యం కొనుగోలు జరగక ఇబ్బందులు పడుతున్నారని రామచందర్‌రావు వెల్లడించారు.

ఇలాంటి తాజా జిల్లా వార్తల కోసం మా Hyderabad News హోమ్‌పేజ్‌ను సందర్శించండి

FAQ's

Q1: బండి సంజయ్‌పై ఆరోపణలు ఏమిటి?

👉 కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజకీయ వివాదం చెలరేగింది.

Q2: రామచందర్‌రావు ఏమన్నారు?

👉 బండి సంజయ్ తప్పు చేయలేదని, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు.

Q3: ముందస్తు బెయిల్ అంటే ఏమిటి?

👉 అరెస్ట్‌కు ముందు తీసుకునే కోర్టు రక్షణ.

Q4: ఈ వివాదంలో ప్రధాన పార్టీలు ఏవి?

👉 బీజేపీ మరియు బీఆర్ఎస్.