17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

రమేశ్ పాకకు ఉత్తమ ప్రజాసేవకుడి పురస్కారం

23-06-2025 01:40 AM

ముషీరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): తెలంగాణ తహసీల్దార్ అసోసియే షన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయంలో ఓఎస్ డిగా కీలక భాధ్యతలను నిర్వహిస్తున్న రమేష్ పాక తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్పర్సన్ జి. వెన్నెల గద్దర్, తెలంగాణ ఫిలించాంబర్ చైర్మన్ పి రామకృష్ణగౌడ్ చేతుల మీదుగా అదివారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ప్రజా సేవకుడు పురస్కారా న్ని అందుకున్నారు.

ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత రోజులో ఒకరికైన ఉపయోగపడాలనే మహత్తర సంకల్పంతో తన వద్దకు వచ్చే వారి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

రమేష్ పాక సేవా దృక్పథం ప్రభుత్వం ఉద్యోగుల్లో సామాజిక బాధ్యతను ప్రోత్సహిస్తుందని, విలువలకు ప్రాధాన్యతను ఇచ్చే ఆయన విధానం ప్రజ సేవలో స్పూర్తిదాయకమని పలువురు వక్త లు కొనియాడారు. ఉత్తమ ప్రజా సేవకుడు పురస్కారాన్ని అందుకున్న రమేష్ పాకను పలు ఉద్యోగ సంఘాల నేతలు, రెవిన్యూ ఉద్యోగులు తదితరులు అభినందించారు.