17 April, 2026 | 11:16 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పూలే దంపతుల సేవలు చిరస్మరణీయం

23-06-2025 01:41 AM

పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి,మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్ జూన్ 22 (విజయ క్రాంతి) : జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే దంపతుల చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బోయపల్లిలో జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల నేటి యువత వారి గురించి తెలుసుకొని మంచి నడవడిక వైపు ముందుకు సాగేందుకు ఎంతో దోహదపడడం జరుగుతుందని తెలిపారు.

కాన్షిరాం,అంబేద్కర్ లాంటి వారు కూడా వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రయత్నించరని పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఉండడం వల్లనే వెనుకబడిన వర్గాల వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవటం ఎందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఎంతోమంది మహనీయులు ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేయడం జరిగిందని, వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మన ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.