30 August, 2026 | 7:24 PM

రామోజీరావు అస్తమయంలపై తెలుగు టీవీ పరిశ్రమ సంతాప సభ

09-06-2024 06:46 PM

హైదరాబాద్ : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంతిమ సంస్కారాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతవనంలో ఆదివారం అధికారక లాంఛనాలతో ముగిసాయి. ఈ నేపథ్యంలో రామోజీరావు అస్తమయంపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంతాప సభను నిర్వహించి, ఆయన చిత్రపటానికి బుల్లితెర నటులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సంతాప సభలో పలువురు మాట్లాడుతూ.. రామోజీరావు.. రియల్ హీరో, ఆయన సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగారని నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు గుర్తు చేశారు.  ఎంత ఎదిగినా మూలాలు మరిచిపోని వ్యక్తి అని అన్నారు. రామోజీరావుకు సినిమా అంటే ఎంలో ప్రాణామని చదలవాడ చెప్పారు. ప్రతిఘటన అనే సినిమా కూడా నిర్మించారని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. పత్రికా ప్రపంచంలో సరికొత్త ఒరవడి సృష్టించి, పత్రిక ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సంపాదించారని పేర్కొన్నారు.