పూలాజీ బాబా బోధనలు అనుసరించాలి
30-08-2026 07:14 PM
ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గంలో జైనూర్ మండలంలోని పట్నాపూర్ లో శ్రీశ్రీశ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా 102వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పూలాజీ బాబా చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూలాజీ బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గం, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన బోధనలు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పూలాజీ బాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.






