మధిరలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.128 కోట్ల నిధులు విడుదల
09-06-2024 04:47 PM
ఖమ్మం : జిల్లాలోని మధిర క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గ అభివృద్ధిపై మున్సిపల్ శాఖ అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధిరలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.128 కోట్ల నిధులు విడుదల చేసిందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం మధిరను దేశంలో నంబర్.1 నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసింది. ఇకా అధికారులు నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు హామీలు ఇచ్చామని, అధికారులు జవాబుదారీ తనంతో పనిచేయాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.






