30 August, 2026 | 6:20 PM

కాసేపట్లో కేంద్రమండలి ప్రమాణ స్వీకారం

09-06-2024 07:16 PM

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ 65 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి 7.15 నిమిషాలకు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్స వేడుక జరుగుతున్న రాష్ట్రపతి భవన్‌కి చేరుకున్న అమిత్ షా, నితిన్ గడ్కరీ, కిరన్ రిజిజు, సీఎం యోగితో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలు వస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు.