పూలాజీ బాబాకు డిసీసీ నివాళులు
జైనూర్, (విజయక్రాంతి): జైనూర్ మండలం పాట్నాపూర్‌లో సద్గురు పూలాజీ బాబా 102వ జన్మదిన మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ హరిత, ఐటీడీఏ పీఓ మంద మకరంద్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌తో కలిసి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొన్నారు.ఈ సందర్భంగా పూలాజీ బాబా సమాధి వద్ద సుగుణక్క ప్రత్యేక పూజలు నిర్వహించి, పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పూలాజీ బాబా ఆధ్యాత్మిక బోధనలు, ధ్యాన మార్గం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించారని అన్నారు. ఆయన చూపిన ఆధ్యాత్మిక మార్గం, సేవాభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పూలాజీ బాబా జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో నార్నూర్ మండల అధ్యక్షుడు గోవింద్, జైనూర్ మండల అధ్యక్షుడు షైక్ రషీద్, డీసీసీ కార్యవర్గ సభ్యుడు సూద్దాల శ్రీనివాస్, ప్రకాష్, నార్నూర్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మెహ్మద్, సర్పంచ్ రాజు, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి, గేడాం గోపీచంద్, కోవ సిద్దు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






