నాపై రామోజీరావు ప్రభావం ఉంది: అల్లం నారాయణ
16-06-2024 12:55 PM
హైదరాబాద్: ప్రెస్ క్లబ్ లో రామోజీరావు సంతాప కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంతాప కార్యక్రమంలో ఈనాడు ఏపీ, ఎడిటర్ ఏం. నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఈనాడులో చేయలేకపోయినా తనపై రామోజీరావు ప్రభావం ఉందన్నారు. భాషలో విలక్షణ శైలికి ఈనాడు పెట్టింది పేరు అన్నారు. జర్నలిజాన్ని రామోజీరావు పల్లెలకు తీసుకువెళ్లారని కొనియాడారు. పత్రిక అంటే ఈనాడు అనే పేరు రామోజీరావు తెచ్చారన్నారు. 50 ఏళ్లుగా ఈనాడు పత్రికారంగాన్ని ముందుండి నడిపిస్తోందని అల్లం నారాయణ తెలిపారు.






