జస్టిస్ నరసింహారెడ్డి వైఖరిలో మార్పు: జగదీష్ రెడ్డి
16-06-2024 12:45 PM
హైదరాబాద్: జస్టిస్ నరసింహారెడ్డి తీరుతో ప్రజల్లో తప్పుడు సమాచారం వెళ్లేందుకు ఆస్కారం ఉందని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.... జస్టిస్ నరహింహరెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని తెలిపారు. ఈనెల 11న జరిగిన మీడియా సమావేశంలో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జస్టిస్ నరసింహరెడ్డి నిజం వైపు ఉంటారని తాము ఆశిస్తున్నామని తెలిపారు. న్యాయ విచారణ పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కోర్టులు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వాలకు విచారణ చేసే అధికారం ఉండదన్నారు. ఈ ఆర్ సీ ఇచ్చిన తీర్పుపై విచారణ చేయకూడదనే జస్టిస్ నరసింహరెడ్డి చెప్పాలని ఆయన పేర్కొన్నారు.






